RTCలో యూనియన్ ఎన్నికల వేడి

TG: RTCలో దాదాపు పదేళ్ల తర్వాత గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 9న ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రహస్య బ్యాలెట్ ద్వారా పోలింగ్ జరుగుతుంది. సుమారు 39 వేల మంది ఉద్యోగులు ఓటు వేయనున్నారు. అక్టోబర్ 14, 15న పోస్టల్ బ్యాలెట్, 17న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 12 సంఘాలు బరిలో ఉండగా, పలు యూనియన్లు పొత్తులతో పోటీ చేస్తున్నాయి. వేతన సవరణ, బకాయిలు, సిబ్బంది కొరత, పని ఒత్తిడి, ఉద్యోగుల సంక్షేమం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి.


