తుంగభద్రకు వరద ప్రవాహం ఆగింది.. నీటిమట్టం ఏం అవుతుంది?

ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి నాలుగు రోజుల నుంచి వరద ప్రవాహం నిలిచిపోయింది. టీబీ డ్యామ్ బోర్డు అధికారులు ఈ విషయం తెలిపారు. సోమవారం ఎలాంటి ఇన్‌ఫ్లో నమోదు కాలేదు. తాగు, సాగు అవసరాల కోసం వివిధ కాలువలకు, నదికి కలిపి 11,117 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 1,628.04 అడుగులకు నీటిమట్టం ఉంది. 86.88 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. వరద రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

