కొత్త ఓటర్లకే ఫస్ట్ ప్రయారిటీ- సుప్రీం

పశ్చిమ బెంగాల్ ఓటర్ల లిస్ట్ వివాదంపై సుప్రీంకోర్టు బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఓటర్ల జాబితాలో పేర్ల చేరిక కోసం వచ్చిన అప్పీళ్లలో ఇప్పటికే లక్షకు పైగా కేసులు క్లియర్ చేశామని, అందులో 93% అర్హులుగా తేలారని సుప్రీంకోర్టుకు తెలిపారు. నవంబర్‌లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నందున, ఓట్ల తొలగింపు కంటే కొత్త ఓటర్ల చేరికకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని కోర్టు డిస్కస్ చేసింది. అలాగే, అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నవారికి కూడా ఓటు వేసే పర్మిషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామంది.



