← Back to news

కాలేజీ భూమిపై వివాదం.. గోడ కూల్చిన స్టూడెంట్స్!

By A.Ajay· 1d ago

UPలోని గ్రేటర్ నోయిడా దనకౌర్‌లోని బిహారీ లాల్ ఇంటర్ కాలేజీ భూమిపై రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఓ వర్గం అక్కడ బౌండరీ నిర్మాణం ప్రారంభించగా, కాలేజీ యాజమాన్యం, స్టూడెంట్స్ అడ్డుకున్నారు. నిర్మాణంలో ఉన్న బౌండరీ గోడను స్టూడెంట్స్ కూల్చేశారు. భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారని కాలేజీ యాజమాన్యం ఆరోపించగా, ఈ భూ వివాదం ఇప్పటికే రెవెన్యూ అధికారుల పరిశీలనలో ఉందని ACP తెలిపారు. పోలీసులు స్టూడెంట్స్‌ను అక్కడి నుంచి పంపించేశారు.

More in National