← Back to news

పంప్ సీల్‌కు వెళ్లిన అధికారి.. అక్కడే దారుణం

By Lokesh· 1d ago· Ndtv
పంప్ సీల్‌కు వెళ్లిన అధికారి.. అక్కడే దారుణం

మహారాష్ట్ర హింగోలీలో పెట్రోల్ పంప్‌ను సీల్ చేసేందుకు వెళ్లిన ఇండియన్ ఆయిల్ సేల్స్ మేనేజర్ మహేశ్ షెల్కే హత్యకు గురయ్యారు. మూడు నెలలుగా మూసి ఉన్న పంప్‌ను సీల్ చేసేందుకు ఆయన టీమ్ వెళ్లింది. మరో నెల సమయం ఇవ్వాలని ఆపరేటర్ కుటుంబం కోరినా అధికారులు అంగీకరించలేదు. దీంతో వాగ్వాదం జరగగా.. ఆపరేటర్ కుమారుడు ఉమేశ్ మహేశ్‌పై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారు.

More in Crime