వాయుగుండం.. గండం!

అక్టోబర్ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోంది. అది తుఫానుగా మారే ఛాన్స్ ఉంది. దాని వల్ల 15 నుంచి కోస్తాంధ్రలో తేలిక వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే అక్టోబర్ 21 నుంచి ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారత్‌లోకి వస్తాయని చెప్పారు. ఇవాళ శుక్రవారం AP, తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రత APలో 37, తెలంగాణలో 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. గాలి వేగం చాలా తక్కువగా ఉంటుంది. వేడి నుంచి జాగ్రత్తలు తీసుకోండి.



