← Back to news

సాంస్కృతిక సారధిలో కొలువుల కోసం నిరసన

By Damidi Chandra Reddy· 5h ago· Siddipet
సాంస్కృతిక సారధిలో కొలువుల కోసం నిరసన

హనుమకొండలోని ఏకశిల పార్క్ వద్ద తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఉద్యోగాల కోసం కళాకారులు బుధవారం చేపట్టిన రిలే నిరాహార దీక్షకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కళాకారులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమ కళాకారులకు సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు మోసం చేసిందని ఆరోపించారు. ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

More in Local