రగులుతున్న 'రాంకీ' చెత్త అంశం!
TG: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాంకీ సంస్థకు చెత్త సేకరణ కాంట్రాక్ట్ ఇస్తే, ఊరుకునే ప్రసక్తే లేదని GHMC కార్మికులు ఆవేదన చెందుతున్నారు. తాము 30 నుంచి 40 ఏళ్లుగా చెత్త బండ్లు నడుపుతూ జీవనం సాగిస్తున్నామనీ.. ఇప్పుడు రాంకీ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగిస్తే, తమ ఉపాధి ప్రమాదంలో పడుతుందని వారు అంటున్నారు. రాంకీకి కాంట్రాక్ట్ ఇస్తే.. హైదరాబాద్ రోడ్లపై చెత్త పోసి నిరసన చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రైవేట్ కంపెనీకి అప్పగిస్తే, తమ దశాబ్దాల కష్టం వృథా అవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.


