← Back to news

సాయిపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

By Naresh Kumar· 1h ago· Vikarabad
సాయిపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు సందడిగా జరిగాయి. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) మహిళలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ పాటలతో ఉత్సాహంగా ఆడిపాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటేలా వేడుకలు ఘనంగా నిర్వహించారు.

సాయిపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
సాయిపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

More in Local