← Back to news

పశువుల లింగయ్యకు నివాళులు అర్పించిన నాయకులు

By @ Alam· 2h ago· Bhadradri Kothagudem
పశువుల లింగయ్యకు నివాళులు అర్పించిన నాయకులు

భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందులో న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకుడు కామ్రేడ్ పశువుల లింగయ్యకు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనారోగ్యంతో మృతిచెందిన లింగయ్య భౌతికకాయంపై CPI(ML) న్యూ డెమోక్రసీ నాయకులు పూలమాలలు వేసి సంతాపం తెలిపారు. BBR మిల్లులో పనిచేస్తూ IFTUలో చేరిన ఆయన కార్మిక హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారు. ఇంద్రానగర్ ప్రాంతంలోని పేదల సమస్యలపై పోరాడటంతో పాటు మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జైలు జీవితం గడిపారని నాయకులు గుర్తుచేశారు.

పశువుల లింగయ్యకు నివాళులు అర్పించిన నాయకులు

More in Local