← Back to news

బుసిరెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

By Suryavamsham Ramu· 1h ago· Wanaparthy
బుసిరెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

వనపర్తి జిల్లా బుసిరెడ్డిపల్లిలో సర్పంచ్ తలకంటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, మహిళల ఐక్యతను చాటుతుందని అన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రజలంతా కలిసికట్టుగా సహకరించి బుసిరెడ్డిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరారు.

More in Local