నర్సంపేట డిపోలో తగ్గుతున్న బస్సు సర్వీసులు

వరంగల్ జిల్లా నర్సంపేట RTC డిపో నుంచి నిజామాబాద్, శ్రీశైలం, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు నడిచే బస్సు సర్వీసులు క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొందరు ఉద్యోగులను ఇతర డిపోలకు బదిలీ చేస్తున్నట్లు సమాచారం. దీంతో డిపోలో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. సర్వీసులు, సిబ్బంది తగ్గింపుతో డిపోను బలహీనపరుస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు.


