ప్రొటెస్ట్ చేయాలంటే ఆ మూడు రోజులే!

ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఈ సంవత్సరం డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో మాత్రమే బుకింగ్‌కు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగతా రోజులకు ఇప్పటికే బుకింగ్స్ పూర్తయ్యాయి. ప్రొటెస్ట్‌లకు కొత్త వేదికలుగా రామ్‌లీలా మైదాన్, బురారీ, CBD గ్రౌండ్లను ప్రకటించిన మరుసటి రోజే ఈ ప్రకటన రావడం చర్చనీయాంశమైంది. ఒక్కరోజు బుకింగ్‌కు 1 లక్ష 21 వేలు చెల్లించాలి. బుకింగ్‌కు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్తో పాటు పోలీసుల NOC(No Objection Certificate) తప్పనిసరి.


