ముస్లిం మహిళలపై ధీరేంద్ర శాస్త్రి వివాదాస్పద కామెంట్స్
మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో జరిగిన 'సనాతన హిందూ ఏకతా రథయాత్ర'లో బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి పండిత్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి సంచలన కామెంట్స్ చేశారు. ‘మన ఆడపిల్లలు దుర్గాదేవి, కాళికాదేవిలా ధైర్యంగా ఉండాలి కానీ, బుర్ఖా వేసుకునేవారిలా మారకూడదు’ అని అన్నారు. నవరాత్రి గర్బా వేడుకల్లోకి వేరే మతాలవాళ్లు పేర్లు మార్చుకుని వచ్చే అవకాశం ఉందని, బయటి వ్యక్తులకు గోమూత్రం ఇచ్చి అనుమతించాలన్నారు. యువత దేశ ప్రతిష్టకు భంగం కలిగించే పనులు చేయవద్దని అన్నారు.


