చిన్నారి ఏనుగు ‘కృష్ణ’కు పుట్టినరోజు వేడుక
మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లో అటవీశాఖ అధికారులు, మావటులు కలిసి అరుదైన వేడుక నిర్వహించారు. తమ సంరక్షణలో ఉన్న ఏనుగు పిల్ల 'కృష్ణ'కు మొదటి పుట్టినరోజు వేడుక చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్కులోని 'బాంధవి' అనే ఏనుగుకు అక్టోబర్ 2025లో ‘కృష్ణ’ జన్మించింది. దాని పుట్టినరోజును పురస్కరించుకుని అటవీ అధికారులు ఏర్పాట్లు చేశారు. మల్టీగ్రీన్ రోటీలు, అరటిపండ్లు, ఆపిల్స్, బెల్లంతో అందమైన, ఆరోగ్యకరమైన కేక్‌ను తయారు చేశారు.