← Back to news

కార్పొరేట్ లైఫ్ వదులుకొని గోవాకు.!

By Krishna· 1h ago· Instagram

ఢిల్లీలో హైఎండ్ లైఫ్‌ని వదిలేసిన అర్పితా సాహు కథ హాట్ టాపిక్ అయ్యింది. MBA చేసి, కాగ్నిజెంట్, ఇన్ఫో ఎడ్జ్ వంటి కంపెనీల్లో నాలుగున్నరేళ్లు HRగా చేసిన ఆమె, అన్నీ వదిలేసి గోవాకు వెళ్లింది. ఇల్లులా అనిపించే చోటు, తన మనుషులు, జీవిత అసలు అర్థం వెతుక్కోవాలనేది ఆమె నిర్ణయం. ఇప్పుడు శాలరీ లేదనీ, బ్యాంక్ బ్యాలెన్స్ త్వరగా అయిపోతుందనే టెన్షన్ ఉందని ఆమె చెప్పింది. ఈ వీడియోకి 8 లక్షల వ్యూస్ వచ్చాయి. గోవాలో కొత్త కెరీర్ వెతుక్కోమని నెటిజన్లు సూచిస్తున్నారు.

More in Viral