ఆ స్టార్టప్ భర్తల కష్టాలు తీర్చేసింది..!

ఢిల్లీకి చెందిన క్యారీమెన్ అనే స్టార్టప్ కంపెనీ కొత్త ఐడియా SMలో వైరల్ అవుతోంది. గంటకు ₹149లకే షాపింగ్ అసిస్టెంట్ సర్వీస్ అందిస్తోంది. ఆ అసిస్టెంట్ మీ వెంటే ఉంటూ 12 కేజీల బరువు మోయడం, క్యూలో నిలబడడం, గొడుగు పట్టడం వంటి పనులన్నీ చేస్తాడు. You shop we carry అన్నది ఆ కంపెనీ ట్యాగ్ లైన్. ఇక షాపింగ్‌లో భర్తల ఉద్యోగాలు ఊడినట్లే అని కొందరు నెటిజన్లు జోకులు వేస్తుంటే.. గర్భిణీలు, వృద్ధులకు ఇదో అద్భుతమైన సాయమని మరి కొందరు ప్రశంసిస్తున్నారు. మొదటి నెలలో 50కి పైగా బుకింగ్స్ వచ్చాయి.



