← Back to news

హోటల్ ఫుడ్‌పై డౌటా? ఇక యాప్‌తోనే కంప్లైంట్!

By Mahesh· 11 Oct 2026
హోటల్ ఫుడ్‌పై డౌటా? ఇక యాప్‌తోనే కంప్లైంట్!

టీ కొట్టు నుంచి స్టార్ హోటల్ వరకు ఎక్కడైనా ఫుడ్ క్వాలిటీపై డౌట్ ఉందా? కేంద్ర ప్రభుత్వానికి చెందిన FSSAI తీసుకొచ్చిన ‘ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ యాప్’ ద్వారా డైరెక్ట్‌గా కంప్లైంట్ చేయొచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ సంస్థలపై కూడా ఫిర్యాదు చేయవచ్చు. పాడైన ఆహారం, కల్తీ పదార్థాలు, ఎక్స్‌పైరీ ఫుడ్, అపరిశుభ్ర కిచెన్లు, ఫుడ్ ప్యాకింగ్ లోపాలపై ఫొటోలతో కంప్లైంట్ చేయొచ్చు. ఫిర్యాదుకు టికెట్ నంబర్ కూడా వస్తుంది.

More in Infotainment