SBI కస్టమర్లకు ATM ఛార్జీల నుంచి రిలీఫ్

SBI కస్టమర్లకు బిగ్ రిలీఫ్. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల బ్యాంకు సమ్మె కారణంగా ATM ఛార్జీలు వసూలు చేయబోమని SBI ప్రకటించింది. ఈ మూడు రోజుల్లో SBI కస్టమర్లు దేశంలోని ఏ బ్యాంకు ATMలోనైనా ఎన్నిసార్లైనా ఫ్రీగా క్యాష్ విత్‌డ్రా, బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. రెగ్యులర్ ఫ్రీ ATM ట్రాన్సాక్షన్స్ లిమిట్ దాటినా ఛార్జీలు ఉండవు. ఎక్స్‌ట్రా GST కూడా వసూలు చేయబోమని బ్యాంకు తెలిపింది.



