70 వేల ఉద్యోగాలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం: కేటీఆర్
TG: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నోటిఫికేషన్లతో సహా నిరూపిస్తే తను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన బీఆర్ఎస్ యువసంగ్రామ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాహుల్ గాంధీకి జైకొడతానన్నారు. ఉద్యోగాలు భర్తీ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో గొంతెత్తారు. నిరుద్యోగుల హక్కుల కోసమే ఈ సదస్సు పెట్టినట్లు తెలిపారు.


