← Back to news

🌱 జీవ ఎరువులతో ఖర్చు తక్కువ

By Venkatapplanaidu· 25 Aug 2026· Ananthagiri
🌱 జీవ ఎరువులతో ఖర్చు తక్కువ

AP : అనంతగిరి మండలం చిలకలగెడ్డ రైతు సేవా కేంద్రంలో ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో రైతులకు జీవ ఎరువులపై ట్రైనింగ్ ఇచ్చారు. అరకు ఏడీఏ మోహనరావు, ఏఓ రంగారావు పాల్గొని జీవ ఎరువుల రకాలు, వాటిని ఎలా వాడాలి, వచ్చే లాభాలను వివరించారు. ఈ ఎరువులు వాడితే నేల సారం పెరిగి పంట ఖర్చు తగ్గుతుందని చెప్పారు. కెమికల్ ఎరువులు తగ్గించి, ఇష్టంగా ఆర్గానిక్ పద్ధతులు పాటించాలని రైతులకు ఆఫీసర్లు సలహా ఇచ్చారు.

More in Local

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు
Local· 22m ago

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఆన్‌లైన్ సెంటర్ కోసం నిర్మించిన రేకుల షెడ్డు ధ్వంసం కావడం వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన ఉప్పర్ నగేష్ పాఠశాల ఎదుట ఆన్‌లైన్ సెంటర్ ఏర్పాటుకు రేకుల షెడ్డు నిర్మించారు. పంచాయతీ అనుమతులు లేవంటూ అదే గ్రామానికి చెందిన ఇబ్రహీం అభ్యంతరం వ్యక్తంచేసి కర్రతో షెడ్డు ధ్వంసం చేసినట్లు నగేష్ ఆరోపించారు. నిర్మాణానికి అనుమతి కోరుతూ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇబ్రహీంపై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ PSలో ఫిర్యాదు చేశారు.