ఆరు గ్యారంటీలపై BRS తీవ్ర నిరసన
TG: జగిత్యాల జిల్లా బీర్పూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై BRS భారీ నిరసన చేపట్టింది. BRS రాష్ట్ర కమిటీ పిలుపుతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావా వసంత సురేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చీపుర్లు పట్టుకుని వీధులు, మురుగు కాలువలను శుభ్రం చేశారు. పల్లె పారిశుధ్యాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని జీవన్‌రెడ్డి ఆరోపించారు.



