కూలే స్థితిలో పాఠశాల

AP : అనంతగిరి మండలం చిలకలగెడ్డ పంచాయతీ దాసరి తోట జిపిఎస్ (TW) పాఠశాల భవనం దారుణంగా దెబ్బతింది. బిల్డింగ్ స్లాబ్‌కు పెద్ద పెద్ద పగుళ్లు వచ్చి భవనం ప్రమాదకరంగా మారడంతో పిల్లలను స్కూలుకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు.ఈ భవనం గురించి అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగి పిల్లల ప్రాణాలకు ముప్పు రాకముందే అధికారులు వచ్చి పరిశీలించి, వెంటనే కొత్త భవనం మంజూరు చేయాలని ఊరి జనం కోరుతున్నారు.




