గణనాథుడి సన్నిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

AP: బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని సంత బజార్‌లో శ్రీ గణపతి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఆగమనం కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలకు గణేష్ నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు భక్తులు, యువత, ఉత్సవ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


