హక్కుల కోసం పోరాడాలి: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి

TG: గొంతెత్తి ప్రశ్నించి పోరాడినప్పుడే రాజ్యాంగం అందించే హక్కులు, న్యాయం ప్రజలకు పూర్తిస్థాయిలో అందుతాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ నిర్వహించిన మీడియా కాన్‌క్లేవ్‌లో ఏ స్ట్రాంగర్ వాయిస్.. ఫర్ స్ట్రాంగ్ నేషన్, జర్నలిస్టుల రక్షణ అంశాలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం, అరెస్టులకు ప్రయత్నించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. పాత్రికేయులు ఐక్యంగా ఉండి తమ హక్కుల పరిరక్షణకు పోరాడాలని సూచించారు.



