రేషన్ దుకాణాల్లో కందిపప్పు బంద్

AP : కూటమి ప్రభుత్వం మొదట్లో రేషన్ షాపుల్లో బియ్యం, షుగర్, జొన్నలతో పాటు కిలో కందిపప్పు 67 రూపాయిలకే ఇచ్చింది. కానీ ఆ సప్లై ఒకట్రెండు నెలలు మాత్రమే నడిచింది. ఆ తర్వాత రేషన్ దుకాణాల్లో కందిపప్పు ఇవ్వడం ఆపేశారు. నెలలు గడుస్తున్నా మళ్లీ కందిపప్పు సరఫరా చేయకపోవడంతో కార్డుదారులు ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ వెంటనే కందిపప్పు పంపిణీని మళ్లీ స్టార్ట్ చేయాలని కోరుతున్నారు.


