తిరుమల నడకదారిలో చిరుత కలకలం

తిరుపతి జిల్లా తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుతపులి కనిపించడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. 2765వ మెట్టు వద్ద ఓ చెట్టుపై చిరుత కూర్చొని ఉండటాన్ని భక్తులు గుర్తించారు. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై భక్తులను గుంపులుగా నడకమార్గంలో పంపిస్తున్నారు. చిరుత సంచారంపై తిరుమల సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. భక్తుల భద్రత దృష్ట్యా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.


