విశాఖలో 99 పైసలకే భూములు ఇచ్చారు: జగన్
AP: కూటమి ప్రభుత్వ పాలనపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రూపాయికి చాక్లెట్ కూడా రాదు.. కానీ చంద్రబాబు కొంతమందికి 99 పైసలకే విలువైన భూములు ఇచ్చారని ఆరోపించారు. గంజాయి, మద్యం విషయంలోనూ ప్రభుత్వం తీరును ప్రశ్నించారు. గీతం యూనివర్సిటీ పేరుతో రూ.5 వేల కోట్ల భూములు కబ్జా చేస్తున్నారని కూడా ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.


