చిన్నారులతో భిక్షాటన చేస్తే కఠిన చర్యలు: ఎస్సై

AP: చిన్నారులను ఆసరాగా చేసుకుని భిక్షాటనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అనపర్తి ఎస్సై వినయ్ ప్రతాప్ హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పరిసర ప్రాంతాల్లో పసిపిల్లలను ఎత్తుకుని భిక్షాటన చేస్తున్న మహిళలకు అధికారులు అవగాహన కల్పించారు. చిన్నారులను భిక్షాటనలో ఉపయోగించడం వల్ల వారి భద్రత, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వివరించారు. ఈ సందర్భంగా మహిళలకు కౌన్సిలింగ్ నిర్వహించి, చిన్నారులను భిక్షాటనకు దూరంగా ఉంచాలని సూచించారు.



