అణుదాడులు చెయ్యం : ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు సీరియస్ అల్టిమేటం జారీ చేశారు. "టైమ్ అయిపోతోంది.. జాగ్రత్త!" అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే అణు దాడుల విషయంలో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి అణు బాంబు వేసే ఆలోచనదేమీ లేదని వైట్ హౌస్ లో విలేకరులతో చెప్పారు. తమ డిమాండ్లకు ఇరాన్ తలొగ్గాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరించారు. అణు దాడులు చెయ్యబోమన్న ట్రంప్ ప్రకటన కాస్త ఊరటనిచ్చేది.
