← Back to news

ప్రకృతి ఒడిలో ప్రయాణం

By A VIJAY KUMAR· 10h ago· Warangal

వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి పాకాల మీదుగా కొత్తగూడ వెళ్లే రహదారి ప్రకృతి అందాలతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ రహదారికి ఇరువైపులా పెరిగిన పచ్చని చెట్లు కనువిందు చేస్తున్నాయి. పచ్చదనంతో నిండిన ఈ మార్గంలో ప్రయాణం ఆహ్లాదాన్ని పంచుతోంది. ప్రకృతి ఒడిలో ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగిస్తూ ఈ రహదారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అటుగా వెళ్లే ప్రయాణికులు పచ్చని చెట్ల అందాలను ఆస్వాదిస్తున్నారు.

More in Local