ప్రతిపక్ష నేతగా KCR ఫెయిల్: CM రేవంత్‌రెడ్డి

TG: ప్రధాన ప్రతిపక్ష నేతగా KCR పూర్తిగా విఫలమయ్యారని, వెంటనే రాజీనామా చేయాలని CM రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ అంబర్‌పేటలో మూసారాంబాగ్ వద్ద రూ.52 కోట్లతో నిర్మించిన హైలెవల్ వంతెనను CM ప్రారంభించారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. వెయ్యి రోజులుగా KCR ప్రజలకు అందుబాటులో లేకుండా బాధ్యతలను విస్మరించారని విమర్శించారు. MLAగా ఆయనకు వెయ్యి రోజుల్లో రూ.1.25 కోట్ల జీతం, భద్రత, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం రూ.21 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. కేసీఆర్ ప్రజా సమస్యలపై స్పందించకుండా ఉండటం సరికాదన్నారు.



