← Back to news

ములుగు లోక్ అదాలత్‌లో 391 కేసులకు పరిష్కారం

By DK· 3d ago
ములుగు లోక్ అదాలత్‌లో 391 కేసులకు పరిష్కారం

TG: ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు సముదాయ భవనంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 391 కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే.చండీశ్వరి తెలిపారు. జిల్లావ్యాప్తంగా సివిల్, క్రిమినల్, పార్టిషన్, మనీ సూట్స్, ఇంజంక్షన్ సూట్స్, మ్యాట్రిమోనియల్ వివాదాలు, చెక్ బౌన్స్, మెయింటెనెన్స్, 420 చీటింగ్ తదితర కేసుల్లో ఇరువర్గాల కక్షిదారులతో మాట్లాడి పరిష్కారం చూపినట్లు పేర్కొన్నారు. కక్షిదారులు రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని తెలిపారు.

More in Local