DSC నోటిఫికేషన్.. డేట్ ఫిక్స్!

AP: రాష్ట్ర ప్రభుత్వం మరో DSC ప్రకటనకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 15న 2,500 పైచిలుకు పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో పాఠశాల విద్యాశాఖలో 2,250 పోస్టులు, ఇతర విభాగాల్లో మరో 300 ఖాళీలు ఉన్నాయి. అలాగే డైట్ లెక్చరర్లు 160, జూనియర్ లెక్చరర్లు 209, లైబ్రేరియన్ల పోస్టులను APPSC భర్తీ చేయనుంది. ఏటా DSC ఇస్తామన్న హామీ మేరకు 2029 వరకు ప్రణాళిక సిద్ధం చేశారు.


