← Back to news

రాయపోల్ Substation పరిధిలో పవర్ కట్

By Prakash· 1d ago· Rayapole, Raipole, Siddipet
రాయపోల్ Substation పరిధిలో పవర్ కట్

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని 33/11 KV రాయపోల్ Substationలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. రాయపోల్, చౌదర్‌పల్లి, కొత్తపల్లి, టెంకంపేట్ గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ప్రజలు, రైతులు తమ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, మరమ్మతులకు సహకరించాలని అధికారులు సూచించారు.

More in Local