తెలంగాణలో విద్యాయాత్ర.. ప్రజలకు పిలుపు

రిటైర్డ్ IAS ఆకునూరి మురళి ఆధ్వర్యంలో 'విద్యాయాత్ర' జరగబోతోంది. తెలంగాణలో ప్రభుత్వ విద్యను కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం. సెప్టెంబర్ 15న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని పెద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర బస్సుయాత్రగా మొదలయ్యే ఈ విద్యాయాత్రను తల్లిదండ్రులే ఫ్లాగ్ ఆఫ్ చేసి విజయవంతం చేయాలని పిలుపిచ్చారు. గవర్నమెంట్ స్కూళ్లను డెవలప్‌చేసి, స్టూడెంట్స్‌కి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం నడుస్తోంది. ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు.


