← Back to news

25 ఏళ్లుగా మట్టి వినాయకుడే.. యువతకు హ్యాట్సాఫ్‌!

By Bala· 3h ago· TG
25 ఏళ్లుగా మట్టి వినాయకుడే.. యువతకు హ్యాట్సాఫ్‌!

నర్సంపేట మండలం దాసరిపల్లికి చెందిన ఫ్రెండ్స్ యూత్‌ బృందం పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తోంది. 2001 నుంచి 25 ఏళ్లుగా మట్టి వినాయకుడినే ప్రతిష్ఠిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. తొలి పదేళ్లు సభ్యులే చెరువు మట్టితో విగ్రహాన్ని తయారు చేసి పూజించగా, గత 15 ఏళ్లుగా స్థానిక కుమ్మరి కళాకారుల నుంచి మట్టి విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. POP విగ్రహాలకు దూరంగా ఉంటూ పర్యావరణాన్ని కాపాడటంతో పాటు కుమ్మరులకు ఉపాధి కల్పిస్తున్నారు.

More in Local