కోతి సెల్ఫీ, కోర్టు తీర్పు

కెమెరా కనిపించగానే నరుటో అనే కోతి.. తనకు తెలియకుండానే సెల్ఫీ తీసుకుంది! ఇండోనేషియాలో ఫొటోగ్రాఫర్ డేవిడ్ స్లేటర్ ఓ చోట కెమెరా పెట్టి దూరంగా వెళ్లగా, నరుటో సడెన్గా వచ్చి.. బటన్ నొక్కి తనని తానే ఫొటో తీసుకుంది. ఆ సెల్ఫీ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ‘ఫొటో కోతిదే కాబట్టి, కాపీరైట్ కూడా దానిదే’ అంటూ PETA కోర్టుకెక్కింది. అయితే జంతువులకు కాపీరైట్ హక్కులు ఉండవని కోర్టు తేల్చింది. ఫొటో ఆదాయంలో 25% కోతుల సంక్షేమానికి ఇస్తానని స్లేటర్ చెప్పాడు.



