మూడుచింతలపల్లికి ప్రీ-ప్రైమరీ లేదు..!

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మూడుచింతలపల్లి మండలానికి 2026-27లో ప్రీ-ప్రైమరీ సెక్షన్ అలాట్ అవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా 2,769 సెక్షన్లు, జిల్లాకు 145 ఉన్నా.. ఇక్కడ ఒక్కటి కూడా లేదు. స్థానికులు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. 73 TPS ప్రతిపాదనల్లో మూడుచింతలపల్లికి చోటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మాపూర్ ZPHSను TPSగా అప్‌గ్రేడ్ చేస్తే ప్రీ-ప్రైమరీ నుంచి హైయర్ క్లాసుల వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఒకే క్యాంపస్‌లో అందుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి.



