JNU కేసు.. కాంగ్రెస్ MPపై చర్యలకు BJP డిమాండ్!
BJP మహిళా MPలు, పురందేశ్వరి ఆధ్వర్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. JNUలో 11 మంది విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన కాంగ్రెస్ MP బిమోల్ అకోయిజామ్ కేసును ఎథిక్స్ కమిటీకి పంపాలని కోరారు. అక్టోబర్ 9న JNU ఆయనను ప్రొఫెసర్ పదవి నుంచి తొలగించింది. ఢిల్లీ పోలీసులు FIR నమోదు చేశారు. అయితే, ఆరోపణలు అవాస్తవమని అకోయిజామ్ ఖండించారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాహుల్, ప్రియాంక గాంధీలను BJP డిమాండ్ చేసింది.


