← Back to news

కిక్కిరిసిన బస్సులు.. ఫుట్‌బోర్డుపై ప్రయాణం

By Srikanth Goud· 1d ago· Jagitial, Jagitial, Jagitial

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి మీదుగా మంచిర్యాల నుంచి కరీంనగర్ వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. బస్సులు కిక్కిరిసిపోవడంతో మహిళలు సైతం ఫుట్‌బోర్డుపై నిల్చొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండుగ రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడపాలని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.

More in Local