Wedding విందు పెడితే ₹1 లక్ష.. వెళ్తే ₹50 వేలు!

కర్ణాటకలోని హరగి గ్రామ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి తర్వాత వరుడి(Groom) కుటుంబం ఇచ్చే ‘బీగర ఊట’ మాంసాహార విందును(బోజనం) బ్యాన్ చేశారు. గ్రామ నిర్ణయాన్ని కాదని విందు ఏర్పాటు చేస్తే ₹1 లక్ష, విందుకు హాజరైతే ₹50 వేల ఫైన్ విధించనున్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఉండటంతో సంప్రదాయం పేరుతో ప్రజలపై ఆర్థిక భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. మీ ఊరిలో ఇలాంటి విందుపై Fine పెడితే.. మీ అభిప్రాయం ఏంటి?
