భారత్‌లో అరాచకం వద్దంటూ లేఖ

భారత్‌లో ప్రజాస్వామ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ 27 దేశాలకు చెందిన 400 మందికి పైగా భారత సంతతి విద్యార్థులు, పరిశోధకులు, విద్యావేత్తలు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ఫలితాలు, కోర్టు తీర్పులపై వివాదాలను ప్రస్తావిస్తూ రాజకీయ విభేదాలను నిరసనల ద్వారా కాకుండా చర్చలతో పరిష్కరించుకోవాలని కోరారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చూపిన రాజ్యాంగ మార్గంలోనే ముందుకు వెళ్లాలని లేఖలో చెప్పుకొచ్చారు.



