లోకేష్ చొరవతో నలుగురు పిల్లలకు ఆధార్ సాయం

మంగళగిరికి చెందిన కూలీ దంపతులు నాగమణి, కాట్రాజు తమ నలుగురు పిల్లలకు ఆధార్ కార్డులు లేక చదువుకు ఇబ్బంది పడ్డారు. సమస్య తీరక పిల్లల చదువు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి వారికి వెంటనే ఆధార్ కార్డులు వచ్చేలా చేశారు. దీంతో హ్యాపీగా ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్కి పంపుతామని చెప్తూ లోకేష్కి థ్యాంక్స్ చెప్పారు.



