48 గంటల్లో రాజీనామా.. CECకు CJP వార్నింగ్!

CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) డిమాండ్ చేసింది. 48 గంటల్లో పదవి నుంచి తప్పుకోవాలని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డెడ్‌లైన్ విధించారు. లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఓటర్ల జాబితా సవరణ SIRపై ఈసీలో విభేదాలు ఉన్నాయన్న వార్తల మధ్య ఈ డిమాండ్ వచ్చింది. మరోవైపు, ఈసీ మాత్రం SIRతో సహా కీలక నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే తీసుకున్నామని తెలిపింది.


