← Back to news

ఆదిలాబాద్ విమానాశ్రయ పనులు వేగవంతం..

By Jagadish· 2d ago
ఆదిలాబాద్ విమానాశ్రయ పనులు వేగవంతం..

ఆదిలాబాద్ జిల్లాలో ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన విమానాశ్రయ ప్రాజెక్టు పనులు స్పీడ్ అందుకున్నాయి. జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ (JUA) అభివృద్ధికి రక్షణ మంత్రిత్వ శాఖ పూర్తి సమ్మతి తెలిపింది. ప్రాజెక్ట్ వేగవంతం చేయడానికి మూడు శాఖల నుంచి వారం రోజుల్లోగా ఒక్కో నోడల్ అధికారిని నియమిస్తారు. డీపీఆర్, మాస్టర్ ప్లాన్ త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. 2.75 కిలోమీటర్ల రన్‌వేకు ఆమోదం లభించింది. ఐఏఎఫ్ వద్ద ఉన్న 369.45 ఎకరాలకు అదనంగా 1,500 ఎకరాలు సేకరిస్తారు.

More in Local