ఊర్లోనే భారీ జాబ్ మేళా.. 5,625 మంది షార్ట్‌లిస్ట్

TG: సూర్యాపేట జిల్లా కోదాడ్‌లో సెప్టెంబర్ 19న జరిగిన మెగా జాబ్ మేళాకు 30 వేల మందికి పైగా యువత వచ్చారు. 350కి పైగా కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. 5,725 మంది జాబ్స్‌కు షార్ట్‌లిస్ట్ అయ్యారు. సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల యువతకు కంపెనీలను నేరుగా కలిసే అవకాశం కల్పించడమే ఈ మేళా లక్ష్యం. తొలి రెండు గంటల్లోనే 700 మందికి పైగా ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. ఐటీ, ఫార్మా, తయారీ, విమానయానం, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, రిటైల్ రంగాల కంపెనీలు ఇందులో ఉన్నాయి.



