ఫోన్ పక్కన పెట్టి.. Latters రాయండి

డిజిటల్ యుగంలో కనుమరుగవుతున్న చేతిరాత ఉత్తరాల సంస్కృతిని మళ్లీ పరిచయం చేస్తోంది బెంగళూరులోని ‘బెకూ బుక్స్’. JP నగర్‌లో ఉన్న ఈ పుస్తకాల షాప్.. ఇంటర్నేషనల్ ‘సండే లెటర్ ప్రాజెక్ట్’లో భారత్ నుంచి పాల్గొంటున్న ఏకైక కేంద్రంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఫోన్లు పక్కన పెట్టి, తమ భావాలను కాగితంపై అక్షరాలుగా రాస్తున్నారు. చేతితో రాసిన లేఖల్లోని ఆప్యాయత, వ్యక్తిగత అనుబంధం మెసేజ్‌లలో దొరకవని నిర్వాహకులు చెబుతున్నారు.



