13 ఏళ్లకే మాస్టర్స్..జో టాలెంట్‌కు అందరూ ఫిదా!
అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన జో సెబోరో వయసు 13 ఏళ్లు. కానీ వచ్చే ఏడాది న్యూయార్క్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదివేందుకు సిద్ధమవుతున్నాడు. జో 10 ఏళ్లకే SAT పరీక్షలో 1600కు 1500 మార్కులు పొందాడు. 11 ఏళ్లకే హైస్కూల్ డిప్లొమా పూర్తి చేశాడు. ప్రస్తుతం లూసియానా స్టేట్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్నాడు. జో ఐక్యూ 168గా చెబుతున్నారు. చిన్నతనంలో టురెట్ సిండ్రోమ్, లుకేమియా వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదురైనా వాటిని అధిగమించాడు. ఫ్యూచర్‌లో సైంటిస్టు అవ్వాలనేది అతని కోరిక.


