అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మంతెన గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక MLA కొండ్రు మురళిమోహన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. దళిత వాడ నాయకులు, యూత్ కలిసి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఇన్స్‌పిరేషన్‌గా తీసుకోవాలని, ఆయన రాసిన రాజ్యాంగం వల్లే అందరికీ ఈక్వల్ రైట్స్ వచ్చాయని MLA అన్నారు. విగ్రహ ఆవిష్కరణ తర్వాత పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విగ్రహం ఏర్పాటుతో గ్రామస్తులు చాలా హ్యాపీగా ఫీలయ్యారు.


